కాంగ్రెస్‌కు షాకిచ్చిన మాయావతి..

232
- Advertisement -

రానున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై ఆమె విరుచుకుపడ్డారు. బీఎస్పీని తుదముట్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని, ఆ పార్టీ నేతలు పొత్తుకు తూట్లు పొడుస్తున్నారని ఆమె విమర్శించారు.

Mayawati

2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మాయావతి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహా కూటమిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో 22 స్థానాలకు తన పార్టీ అభ్యర్థులను కూడా ఆమె ఇప్పటికే ప్రకటించారు.పొత్తు చెడిపోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగే కారణమని ఆమె ఆరోపించారు. ఆయనో బీజేపీ ఏజెంట్ అని విమర్శించారు.

తమతో పొత్తు పెట్టుకుంటే కేంద్రం తనపై ఎక్కడ ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తోందనని దిగ్విజయ్ భయపడ్డారని మాయావతి విమర్శించారు. తనపైనే కేంద్రం ఒత్తిడి కారణంగా పొత్తుకు వెనుకాడుతున్నట్లు దిగ్విజయ్ ఆరోపించడాన్ని ఆమె ఖండించారు. రాహుల్, సోనియా గాంధీలను మాత్రం ఆమె వదిలేశారు.

- Advertisement -