కాంగ్రెస్‌ను ఉతికారేసిన కేసీఆర్..

217
KCR
- Advertisement -

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం.. నిజామాబాద్ జిల్లా మొట్టమొదటిసారి స్వతంత్రంగా జిల్లా పరిషత్‌ను గెలిపించింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వదలకుండా రెండు ఎంపీలు, 9 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపించిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఉద్యమంలో ఎల్లప్పుడూ అగ్రభాగాన ఉన్న జిల్లా. 2014లో టీఆర్‌ఎస్ చేతుల్లో రాష్ట్రం ఉంటే బాగుంటుందని అధికారం మాకిచ్చారు.

నాడు అన్ని సంక్షోభాలే. వలసలు, కరువులు, శిథిలమైన చెరువులు, మూలన పడ్డ చెరువులు.. ఈ పరిస్థితి జూన్ 2, 2014 నాటిది. గుడ్డివాళ్ల లాగా మద్దతిస్తున్నాం. రాజకీయ చైతన్యం తప్పనిసరి అని చెప్పినాను. కరెంట్ కష్టాలతో సతమతమవుతున్న సమయంలో.. మూడు తీగలకు కరెంట్, టీడీపీ, కమ్యూనిస్టు జెండా కట్టమని చెప్పితే మీరు చప్పట్లు కొట్టారు. అప్పుడు ఆ జెండాలను నేలకేసి కొట్టినందుకే ఈనాడు గులాబీ జెండా 24 గంటల కరెంట్ ఇచ్చామని కేసీఆర్ తెలిపారు.

Telangana Cm KCR

ఆ అంటే కేసు.. ఊ అంటే కేసు అంటూ విమర్శలు గుప్పిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ బతుకులే కేసుల మయమని మండిపడ్డారు. ప్రతిదానిపైనా కాంగ్రెస్ నేతలు కేసులు వేస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పోదామని బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు… తాను ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత …ఆ నేతలు గిలగిలాడుతున్నారని ఎద్దేవా చేశారు. పింఛన్ పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఎంత పెంచేదీ ఇప్పుడే చెప్పబోమని అన్నారు. అయితే కాంగ్రెస్ నేతల నోటి నుంచి రూ.2వేలు ఇస్తామని చెప్పించిన ఘటన గులాబీ జెండాదేనని అన్నారు. త్వరలోనే మ్యానిఫెస్టోను రూపొందిస్తామని తెలిపారు. 452 పథకాలు అమలు చేస్తున్నామని, రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణయే అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక ఆర్థిక ప్రగతిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు.

ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్… మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. పోచారం శ్రీనివాసరెడ్డికి తాను పెట్టిన పేరు లక్ష్మీపుత్రుడని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు నీళ్లు అందించాలంటూ ఆయన తనతో కొట్లాడి సాధించుకున్నారన్నారు. పోచారం వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక రైతులకు మేలు జరుగుతుందన్నారు. రూ.10కోట్లు ఇచ్చి ఎర్రజొన్న రైతులను ఆదుకున్నామన్నారు. ప్రతి ఇంటికి నల్లా నీళ్లు , రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే మా లక్ష్యం‘ అని టీఆర్ఎస్ అధ్యక్షుడు, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

- Advertisement -