థియేటర్ల బంద్ లేదు:ఫిల్మ్ చాంబర్

11
- Advertisement -

థియేటర్ల బంద్ వివాదంపై క్లారిటీ ఇచ్చింది తెలుగు ఫిల్మ్ చాంబర్. ఇవాళ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్లతో చర్చించాం అని తెలుగు ఫిలిం చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు.

జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత అనేది లేదు అని వెల్లడించారు. చిత్ర ప్రదర్శనలు యథావిధిగా కొనసాగుతాయి… మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం అని తెలిపారు.

ఈనెల 30న సమస్యలపై కమిటీ వేస్తున్నాం అని… ఏపీ మంత్రి దుర్గేష్‌కి ఏ సమాచారం ఉందో మాకు తెలీదు అని స్పష్టం చేశారు.

Also Read:Rahul:రాహుల్ పై నాన్‌ బెయిలబుల్ వారెంట్

- Advertisement -