AP:వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత..

9
- Advertisement -

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నకిలీ ఇండ్ల పట్టాలకు సంబంధించిన కేసులో కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో వెంటనే ఆయన్ని కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వెంటనే వంశీ భార్య పంకజశ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని కూడా అక్కడికి వచ్చి వంశీ ఆరోగ్యంపై ఆరా తీశారు. వంశీ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం వంశీ ఆరోగ్యంపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అదనపు పరీక్షల అనంతరం అవసరమైతే ఆయనను ప్రత్యేక వైద్యసదుపాయాలకు తరలించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Also Read:Rahul:రాహుల్ పై నాన్‌ బెయిలబుల్ వారెంట్

- Advertisement -