- Advertisement -
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో కీలక సమావేశం జరిగింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సంయుక్త సమావేశం నిర్వహించారు. థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుకు ఎగ్జిబిటర్లు పట్టుబట్టారు.
పర్సంటేజ్ ఇవ్వకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని తెలిపారు. ఎగ్జిబిటర్ల నిర్ణయంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం నిర్వహించారు. ఇక జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అలోచనపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
థియేటర్ల బందు నిర్ణయం వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని ఏపీ హోంశాఖను ఆదేశించారు మంత్రి కందుల దుర్గేష్. హరిహర వీరమల్లు విడుదల సమయంలో బంద్‍పై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఎగ్జిబిటర్ల నిర్ణయంపై నిర్మాతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Also Read:Monsoon: కేరళను తాకిన నైరుతి
- Advertisement -

