‘ఆర్జీవి మిస్సింగ్’ నుండి ఆసక్తికరమైన పోస్టర్‌..!

154
RGV Missing
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్జీవి మిస్సింగ్’.తాజాగా ఈ సినిమా నుండి వర్మ మరో పోస్టర్ ను విడుదల చేశారు. తాను మిస్సైన ఘటనకు సంబంధించిన సినిమా ఇదంటూ ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలోంచి ఇప్పటికే విడుదలైన పలు పోస్టర్లపై అభిమానులు అమితాసక్తి కనబర్చారు.

ఈ చిత్రంలో తాను కనపడకుండా పోవడంతో దీనిపై విచారణ జరుగుతుందని, అనుమానితులుగా పీకే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఉంటారని చెప్పారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో పలువురు ప్రముఖులను పోలిన పాత్రలను చూపించారు. ‘ఆర్జీవీ మిస్సింగ్ త్వరలో రానుంది. ఇందులో పీకే, ఎమ్మెస్, బీ, మాజీ సీఎం, పప్పు, కేపీ, ఆర్కే ఉన్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు.

- Advertisement -