గణతంత్ర వేడుకల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కని అవకాశం..

192
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు అనుమతి లభించలేదు. 12 రాష్ట్రాలు, 9శాఖల శకటాలను ప్రదర్శించేందుకు కేంద్రం అనుమతించగా.. అరుణాచల్‌ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూకాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్ శకటాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కాగా,ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుతాయి.

సాధారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సైనిక విన్యాసాలు ఒక ఎత్తు అయితే, దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించి ప్రదర్శించే శకటాలు మరోక ఎత్తు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అయా రాష్ట్రాలు తమ ప్రత్యేకతను చాటుతూ రాజ్‌పథ్‌లో శకటాలు ప్రదర్శిస్తుంటాయి. ముఖ్యంగా తమ తమ రాష్ట్రాల చరిత్ర, సంస్కృతులు ప్రతిభించేలా ఈ శకటాలను రూపొందిస్తుంటారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో దేశంలోని 29 రాష్ట్రాలకు గాను కేవలం 21 రాష్ట్రాలకు మాత్రమే తమ శకటాలను ప్రదర్శించే అవకాశం దక్కింది.

- Advertisement -