తిరుమలలో10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం..

93
- Advertisement -

టిటిడి ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాల్లో దాదాపుగా 502 శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆలయాలను నిర్మించడం జరిగిందని టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. ఇవాళ తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సి,ఎస్టీ,ఫిషర్ మెన్ కాలనీల్లో ఆలయాలను అధికంగా నిర్మించామన్నారు. ఆ ప్రాంతంలోని దేవాలయాల నిర్వహణకు అదే కులానికి సంబంధించిన వారిని వేదాలు నేర్పించి అర్చకులుగా నియమించామన్నారు..గత బ్రహ్మోత్సవంలో రాష్ట్రంలోని వెనుకబడిన వారిని తిరుమలకు తీసుకుని వచ్చి శ్రీవారి దర్శనం కల్పించాంమని ఆయన స్పష్టం చేశారు.

వైకుంఠ ద్వారా దర్శనం 10 రోజుల పాటు అందుబాటులో ఉందని, ఈ నేపథ్యంలో వెనుకబడిన షెడ్యూల్ కులాల వారికి వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించే ప్రయత్నం చేసామన్నారు. 13 జిల్లాల నుంచి సమరస ఫౌండేషన్ సహకారంతో భక్తులను ఎన్నిక చేసి స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా నుంచి వెయ్యి మంది భక్తులకు దర్శనభాగ్యం కల్పించామని తెలిపారు. హిందూ ధర్మం పాటించి, వారి ప్రాంతాల్లో హిందూ ధర్మాన్ని పెంపొందించాలని షెడ్యూల్ కులస్తులను అభ్యర్థించినట్లు టిటిడి అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు.

- Advertisement -