నాకు హిట్3 కథ చెప్పలేదు -శేష్

145
- Advertisement -

అన్ని కార్యక్రామాలు పూర్తి చేసుకున్న ‘హిట్2’ రేపే థియేటర్స్ లోకి రానుంది. హిట్ ఫస్ట్ కేస్ తో విశ్వక్ సేన్ హిట్ కొట్టగా ఇప్పుడు హిట్ కేస్ 2 తో శేష్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. అయితే హిట్2 ఇంకా రిలీజ్ అవ్వకముందే హిట్3 హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫ్రాంచైజ్ నుండి రాబోయే నెక్స్ట్ మూవీ పై లీకులు చక్కర్లు కొట్టాయి. నాని తో పాటు విజయ్ సేతుపతి నటిస్తాడని అలాగే శేష్ కూడా ఉంటాడని ప్రచారం జరిగింది. దీనిపై నాని అండ్ టీం రెస్పాండ్ అవ్వలేదు. అయితే శేష్ మాత్రం పార్ట్ 3 తను ఉంటానని చెప్పెసుకున్నాడు.

తాగా శేష్ ను ఇంటర్వ్యూలో హిట్౩ ఎప్పుడు ఉంటుంది ? కథేంటి ? అడగ్గా… ఇంకా తనకి హిట్ 3 జస్ట్ ఐడియా మాత్రమే తెలుసని చెప్పుకున్నాడు. ఇంకా కథ వినలేదని అన్నాడు. క్లైమాక్స్ లో మాత్రం హిట్ 3 కి లీడ్ ఉంటుందని అన్నాడు. అలాగే ఈ సినిమాలో హిట్ ఫస్ట్ కేస్ కి చిన్న కనెక్షన్ ఉంటుందని చెప్పుకున్నాడు. ఇక నెక్స్ట్ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ లో చేస్తున్నాని దానికి తన ఫ్రెండ్ డైరెక్టర్ అని చెప్పాడు.

అలాగే గూడచారి 2 కి కథ రాస్తున్నానని ఇంకా ఫైనల్ అవ్వలేదని, ఆ కథ మా డైరెక్టర్ కి నచ్చాలి, మేము డిస్కస్ చేసుకోవాలి చాలా ప్రాసెస్ ఉందని అన్నాడు. ఇక ఈ ఏడాదిలో తన నుండి రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు శేష్. రేపు రిలీజ్ అవ్వనున్న హిట్ 2 శేష్ సక్సెస్ పరంపర సాగుతుందా ? లేదా సక్సెస్ కి బ్రేక్ పడుతుందా ? చూడాలి.

ఇవి కూడా చదవండి…

నటి పూనమ్‌కు ఫిబ్రోమయాల్జియా…

వయసైపోతున్నా అందం తగ్గట్లేదు.. కారణమదే

- Advertisement -