ఆ పుస్తకాలపై నా ఫొటో వద్దు- కేసీఆర్‌

163
No Need any Political Leaders Photos on New Passbooks Says CM...
- Advertisement -

రైతులకు కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్లాన్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాస్‌పుస్తకాల నమూనాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం (ఫిబ్రవరి 9) పాస్‌పుస్తకాలకు సంబంధించి ఆయన పలు నమూనాలను పరిశీలించారు. పచ్చని పంటలకు గుర్తుగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న పాస్‌ పుస్తకాన్ని సీఎం ఎంపిక చేశారు. పాస్‌బుక్‌లో తన ఫొటో ఉన్న నమూనాలను కూడా అధికారులు ఈ సందర్భంగా కేసీఆర్‌కు చూపించారు.

దీనిపై స్పందించిన సీఎం, పాస్‌ పుస్తకంపై రైతు ఫొటో తప్ప మరెవరి ఫొటో వద్దని, రాజకీయ నాయకుల ఫొటోలు అవసరంలేదన్నారు. కేవలం రైతు ఫొటో, తెలంగాణ ప్రభుత్వ ముద్ర మాత్రమే పాస్‌ పుస్తకంపై ఉండాల ఆదేశించారు.

అనంతరం.. కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లారు. కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ తదితరులు ఉన్నారు. గత కొద్ది రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్న సీఎం.. చికిత్స నిమిత్తం ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. హస్తినలో సీఎం కేసీఆర్.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ కలవనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మార్చి 11న కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ప్రధానమంత్రిని ఆహ్వానించే అవకాశముంది.

- Advertisement -