మోదీ- అమిత్ షా..ఈ ద్వయమే వేరు. ఎన్నికల రణరంగంలో ఎత్తులు వేయడం, ప్రత్యర్ధి పార్టీలను చిత్తు చేయడం,కమలం పార్టీ లేని చోట సైతం ప్రభావం చూపేలా రాజకీయ వ్యూహాలు రచించడంలో వీరికి ఉన్న అనుభవమే వేరు. అయితే ఇప్పుడు వీరి ప్రతిష్ట మసకబారుతుందా..?ఎన్నికల ప్రచారానికి వీరిని ఎవరూ దూరం పెట్టారు. ఎంటా కథాకమీషూ చూద్దాం..
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో అధికార అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని సత్తాచాటాలని భావిస్తున్న బీజేపీకి రాజకీయాల్లో ఇది నిజంగా ఉహించని పరిణామమే. ఎందుకంటే ఎన్నికలు ఏవైనా మోదీ-అమిత్ షా ద్వయం ప్రచారం చేయాల్సిందే. ఎన్నికలను రక్తికట్టించాల్సిందే.
కానీ ఈసారి కాషాయ నేతలు వీరిద్దరిని ప్రచారినికి పిలవాలంటేనే ముహం చాటేస్తున్నారు. ఇక అన్నాడీఎంకే నుండి సైతం బీజేపీ నేతలకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా కమలనాథులే వెల్లడిస్తున్నారు. అనేక నియోజవర్గాల్లో అన్నాడీఎంకే అభ్యర్ధులు మమ్మల్ని ప్రచారంలోకి రానివ్వడం లేదు. ఒకవేళ గట్టిగా పట్టుబడితే, వస్తే రండి గానీ, కాషాయ కండువాలు, బీజేపీ జెండాలు చేబూనకుండా వచ్చి పాల్గొనండి అని చెబుతున్నారని వాపోతున్నారు.
ఇక బీజేపీ అభ్యర్థులు సైతం ప్రచారంలో ఎక్కడా మోదీ పేరు లేకుండా,రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీ పోస్టర్ల దగ్గరి నుండి,వాల్ రైటింగ్స్ వరకు జయలలిత,ఎంజీఆర్ పేర్లను వాడుతున్న బీజేపీ నేతలు నానా అవస్థలు పడుతున్నారు. మొత్తంగా తమిళనాట జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.