కేంద్రబడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పసలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అన్న రాహుల్ ప్రసంగం బాగుందని ఎద్దేవా చేశారు. కీలక రంగాలకు మొండి చేయి చూపించారని మండిపడ్డారు.
బడ్జెట్ అంతా షేర్-షాయరీలేనని విమర్శించారు. యువతకోసం, రైతుల కోసం కేంద్ర బడ్జెట్‌లో ఏమీ చేయలేదని ఆయన పెదవి విరిచారు. రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో పారదర్శకత పాటించేందుకు తీసుకునే ఎలాంటి చర్యలకైనా తాము మద్దతిస్తామన్నారు. బడ్జెట్‌లో తాము మెరుపులకోసం ఎదురు చూశామని కానీ అలాంటివేమీ లేక బడ్జెట్ ప్రసంగం చాలా చప్పగా ముగిసిందని రాహుల్ పేర్కొన్నారు.
ఈ బడ్జెట్ వల్ల ప్రజలకు ఒనగూరే మేలు ఏమీ లేదని పేర్కొన్నారు. ప్రజలను మభ్య పట్టేందుకు బిజెపి ప్రభుత్వం యత్నిస్తోందని … ఐదు రాష్ట్రాల ఎన్నికలను ప్రభావితం చేయాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నించిందని, కానీ ఐదు రాష్ట్రాల ప్రజలు బిజెపిని నమ్మరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.