- Advertisement -
మందుబాబులకు గట్టిషాకిచ్చింది నాంపల్లి కోర్టు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ పలువురి లైసెన్సులను జీవిత కాలం రద్దుచేసింది. మరి కొంత మందికి జైలు శిక్ష విధించింది.
మందుబాబులకు ఎన్ని శిక్షలు వేసినా మార్పు రాకపోవడంతో నాంపల్లి కోర్టు ఆసక్తికర తీర్పు వెలువరించింది. కొంతమందికి జీవితకాలం లైసెన్స్ రద్దు మరికొంతమందికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తే ఇంకొంతమందికి కోర్టు సమయం ముగిసే వరకు నిలబడి ఉండాలనే పనిష్మెంట్ ఇచ్చింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 480 మంది బైకర్లు దొరికారు. వీరికి నాంపల్లి కోర్టు గురువారం శిక్ష విధించింది. 62 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయగా 31 మందికి మూడు రోజులు, 142 మందికి రెండు రోజులు జైలు శిక్ష విధించింది. 257 మందిని కోర్టు సమయం ముగిసే వరకు నిలబడి ఉండాలని జడ్జి ఆదేశించారు.
- Advertisement -