ట్విట్టర్ రివ్యూ : రాక్షసుడు

392
rakshasudu twitter review

హిట్ ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. ఇండస్ట్రీలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ హీరో తాజాగా రాక్షసుడిగా ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా రాక్షసుడుతో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం…

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాచ్చసన్’ సినిమాను ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగులు రాశారు. ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

రాక్షసుడు సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు ట్విట్లు చేస్తున్నారు. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆకట్టుకోగా గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన నటన చాలా బాగుందని కొనియాడాతున్నారు. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం స్క్రీన్‌ప్లే అని చెబుతున్నారు.

జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ సినిమాకు మరో బలం అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయిందని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. మొత్తంగా సినిమా అయితే చాలా బాగుందని, ఎంగేజింగ్ థ్రిల్లర్ అని ప్రశంసిస్తున్నారు.