చిరు 152 కోసం అనసూయ…అస్సలు తగ్గట్లేదు..!

361
anasuya bharadwaj pics goes viral

అందం, నటన, యాంకరింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హాట్ బ్యూటీ అనసూయ. ఓవైపు బుల్లితెరపై కామెడీ షోలు చేస్తూనే మరోవైపు మంచి మంచి పాత్రలు దక్కినప్పుడు సినిమాల్లో కూడా నటించి మెప్పిస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా మెప్పించిన అనసూయ తాజాగా చిరు 152లో నటించే అవకాశం కొట్టేసింది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ మూవీలో అనసూయ తన అందాలతో ప్రేక్షకులను ఫిదా చేయనుందట. ఈ మేరకు అనసూయ తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. సైరా విడుదల తర్వాత అక్టోబర్‌లో ఈ మూవీ పట్టాలెక్కనుంది.

రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా మెప్పించింది అనసూయ. రంగమ్మత్త పాత్ర అనసూయకి మంచి పేరును తీసుకువచ్చింది . అ తర్వాత అంతా ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆమె నటించింది లేదు.తాజాగా కొరటాల శివ మూవీలో అలాంటి పాత్రే దక్కనుందని సమాచారం.