కొన్ని రోజుల క్రితం గ్రాండ్ గా లాంచ్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి హీరోయిన్ సమస్య వచ్చిపడింది. కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా ఎనౌన్స్ చేశాడు. ఇప్పుడు టైటిల్ తో పాటు కథ కూడా మారింది. ఆ టైంలో హీరోయిన్ గా పూజ ని లాక్ చేసుకున్నారు మేకర్స్. కానీ ఆ ప్రాజెక్ట్ అనుకున్నట్టుగా సెట్స్ పైకి వెళ్ళలేదు. దీంతో పూజా తన డేట్స్ మరో సినిమాకి ఇచ్చేసి బిజీ అయిపోయింది.
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఇచ్చేందుకు పూజ చేతిలో డేట్స్ లేవు. ఈ రీజన్ కారణంగా పవన్ తో నటించే చాన్స్ పూజ హెగ్డే మిస్ అయ్యిందట. ప్రస్తుతానికి మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు కానీ పూజ సినిమాను నుండి అవుట్ అనేది పక్కా అని తెలుస్తుంది. మరో స్టార్ హీరోయిన్ డేట్స్ పట్టుకునేందుకు హరీష్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పూజ హెగ్డే రెండు సినిమాల్లో నటించింది. ఐరన్ లెగ్ అనే ఇమేజ్ కారణం చేత తెలుగులో అవకాశాలు లేక బాలీవుడ్ కి వెళ్ళిపోయిన టైంలో హరీష్ పిలిచి మరీ డీజే సినిమా ఆఫర్ ఇచ్చాడు. అక్కడి నుండి అమ్మడి దశ తిరిగింది. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ అయిపోయింది. మరి ఆ కృతజ్ఞతతో అయినా హరీష్ శంకర్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేస్తే బాగుంటుందని పవన్ ఫ్యాన్ భావిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ పూజ ప్లేస్ లో మరో హీరోయిన్ పేరు ప్రకటించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..