కొత్త ట్రాఫిక్ రూల్స్‌..హెల్మెట్ లేకుండా నడిపితే లైసెన్స్ రద్దు!

155
roads
- Advertisement -

కేంద్రం కొత్త ట్రాఫిక్ రూల్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి లైసెన్స్‌ను జీవితకాలం రద్దుచేయాలని అన్ని రాష్ట్రాలు కఠినంగా ఈ చట్టాన్ని అమలు చేయాలని తెలిపింది.

ఇకపై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కితే మొదటిసారి మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. రెండోసారి కూడా హెల్మెట్ లేకుండా పోలీసులకు చిక్కితే డ్రైవింగ్ లైసెన్స్ ను జీవితకాలం రద్దు చేయనున్నారు.

ఇందుకోసం మోటార్ వెహికల్ చట్టం 206లో సవరణలు చేసింది కేంద్రం. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ , రాష్ డ్రైవింగ్, ట్రిబుల్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం, సిగ్నల్ జంపింగ్ చేయడం వంటి వాటివల్ల చాలావరకు ప్రాణాలు పోతున్నాయని అందుకే కఠినంగా ఈ చట్టాన్ని అన్నిరాష్ట్రాలు అమలుచేయాలని కేంద్రం తెలిపింది.

- Advertisement -