నిజామాబాద్ డాక్టర్లపై ఎమ్మెల్సీ కవిత ప్రశంసలు..

124
kavitha
- Advertisement -

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లపై ప్రశంసలు గుప్పించారు ఎమ్మెల్సీ కవిత. కరోనా పాజిటివ్ వచ్చిన ఓ మహిళ ముగ్గురు శిశువులకు జన్మనివ్వడం …పిల్లలతో పాటు తల్లి కూడా క్షేమంగా ఉండటంతో నిజామాబాద్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనపై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు ఎమ్మెల్సీ కవిత. కొవిడ్ బారి నుంచి మ‌హిళ‌తో పాటు ఆమె ముగ్గురు శిశువుల‌ను నిజామాబాద్ జిల్లా ఆస్ప‌త్రి వైద్యులు, సిబ్బంది కాపాడ‌టం గ‌ర్వంగా ఉంద‌ని క‌విత ట్వీట్ చేశారు.

కోటగిరికి చెందిన నస్రీమ్‌బేగం అక్టోబర్‌ 21న కాన్పు కోసం ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చారని, ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్లు తెలిపారు. కొవిడ్‌ చికిత్స ప్రారంభించిన వెంటనే డెలివరీ చేయగా ముగ్గురు పిల్లలు జన్మించారని… ఇందులో ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడబిడ్డ ఉన్నారని, వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చిందన్నారు. ప్రస్తుతం బాధితురాలు సైతం కరోనా నుంచి పూర్తిగా కోలుకుందని తెలిపారు.

- Advertisement -