ఆ సాహసం చేయను:ఎన్టీఆర్

168
No guts to act in cricket biopics
- Advertisement -

క్రికెటర్ల జీవితాలు సిల్వర్ స్క్రీన్‌పై రావడం ఆనందంగా ఉందని…కానీ వారి బయోపిక్స్ చేయడానికి తాను సాహసం చేయనని తెలిపాడు జూనియర్ ఎన్టీఆర్. ఐపీఎల్‌ తెలుగు మ్యాచ్‌ల ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్‌…పార్క్ హయాత్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అంటే తనకు ఇష్టమని..సింహాద్రి సినిమా విజయం తొలి సిక్స్ కొట్టినంత ఆనందం ఇచ్చిందన్నాడు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ వాయిస్‌తో విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఐపీఎల్‌ తెలుగులో ఏంటి స్పెషల్‌ అని స్నేహితుడు అంటే.. కారం లేని కోడి, ఉల్లిపాయ లేని పకోడి, పెట్రోల్‌ లేని గాడీ, మీసాలు లేని రౌడీ, పరిగెత్తడం రాని కేడీ, ఆవకాయ లేని జాడీ, ఆటల్లేని బడి, అమ్మ ప్రేమ లేని ఒడి అంటూ ఎన్టీఆర్‌ ప్రాసతో డైలాగ్‌లను బుల్లెట్లలా వదులుతుంటే సదరు స్నేహితుడు దండం పెట్టేస్తాడు. ‘అసలు మజా తెలుగురా’ అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌ ఇప్పుడు ట్రెండింగ్‌ మారింది.

- Advertisement -