- Advertisement -
కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో గణపతి మండపాలకు అనుమతులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బాటలోనే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా తీవ్రత ఉన్న నేపథ్యంలో వినాయక చవితి పండగను ఇంట్లోనే జరుపుకోవాలని సూచించింది ఏపీ సర్కార్. విగ్రహాలు పొడవు 2 అడుగుల కంటే ఎక్కువగా ఉండకూడదని.. ఎక్కడ ప్రతిష్టించారో అక్కడే నిమజ్జనం చేయాలని తెలిపింది.
పూజా సామాగ్రి కొనుగోలు ప్రదేశాల్లో కూడా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, భారీ విగ్రహాలు ప్రతిష్టించడానికి వీలు లేదు. నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని పరోక్షంగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
- Advertisement -