రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న సభ్యులకు వీడ్కోలు పలుకుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాజకీయాల్లో ఎప్పుడూ “ఫుల్ స్టాప్” ఉండదని, ప్రజా జీవితంలో సేవ చేయడం కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు.
రిటైర్ అవుతున్న సభ్యుల సేవలను కొనియాడారు. పార్లమెంట్ కార్యకలాపాల్లో ప్రతి సభ్యుడి పాత్ర ఎంతో ముఖ్యమని, వారి అనుభవం దేశానికి ఎప్పటికీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా వారు ప్రజాసేవలో భాగస్వాములు అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
“రాజకీయాల్లో ఫుల్ స్టాప్ ఉండదు, కేవలం కొత్త దశలు మాత్రమే ఉంటాయి” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నంత వరకు నాయకత్వం కొనసాగుతుందని ఆయన చెప్పారు. రిటైర్ అవుతున్న సభ్యులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఎదురుచూస్తున్నాయని శుభాకాంక్షలు తెలిపారు.
Also Read:మొక్కజోన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన
ఈ సందర్భంగా సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 37 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్న నేపథ్యంలో, వారి సేవలను గుర్తుచేసుకున్నారు.
ఇక ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, రాజకీయ నాయకులు నిజంగా ఎప్పుడూ రిటైర్ కావరని, ప్రజాసేవ అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.

