‘జై హనుమాన్’ షూటింగ్ కి ముందే..!

7
- Advertisement -

‘జై హనుమాన్’ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే భారీ వ్యాపారం చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. Jai Hanuman పై ఇప్పటికే ఉన్న అంచనాలు ఈ నాన్-థియేట్రికల్ డీల్స్‌తో మరింత పెరిగాయి.

టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను దాదాపు రూ.110 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్. అదేవిధంగా హిందీ శాటిలైట్ హక్కులు, డబ్బింగ్ రైట్స్ ద్వారా మరో రూ.75 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. అంటే, ఇంకా షూటింగ్ పూర్తికాకముందే ఈ చిత్రం సుమారు రూ.200 కోట్లకు పైగా బిజినెస్ చేయడం విశేషం.

ఇంకా తెలుగు థియేట్రికల్ హక్కులు, ఆడియో రైట్స్, ఇతర ప్రాంతీయ మార్కెట్లు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా రిషబ్ శెట్టికి కర్ణాటకలో ఉన్న భారీ ఫాలోయింగ్ ఈ సినిమాకు అదనపు ప్లస్ పాయింట్‌గా మారనుంది. అలాగే హిందీ మార్కెట్‌లో కూడా ఈ చిత్రంపై భారీ క్రేజ్ కనిపిస్తోంది.

మొత్తంగా చూస్తే, అన్ని హక్కులు కలిపి నిర్మాతకు కనీసం రూ.100 కోట్లకు పైగా టేబుల్ ప్రాఫిట్ రావడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో, Hanu-Man కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్’ మార్కెట్ మాత్రం దానికి పది రెట్లు పెరగడం విశేషం.

Also Read:మొక్కజోన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన

- Advertisement -