Kavitha:BJP డిపాజిట్లు కొల్పోవడం ఖాయం

29
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో డిపాజిట్ కొల్పోవడం ఖాయమన్నారు ఎమ్మెల్సీ కవిత.అబద్ధాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిందని, రూ. 15 లక్షలు ఒక్కో ఖాతాలో వేస్తామని చెప్పి విస్మరించారని, ఏటా 2 కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణలో 2 లక్షల 21 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రైవేటు రంగంలో 30 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించి యువతకు భరోసా కల్పించామని వివరించారు.

తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా తమ పార్టీ మెనిఫెస్టో ఉందని, అన్ని వర్గాలకు మరింత అభ్యున్నతి కలిగేలా ఉందని తెలిపారు.తెలంగాణ ప్రజల కోసం సీఎం కేసీఆర్ మంచి మెనిఫెస్టోను విడుదల చేశారని తెలిపారు. ప్రగతి పథంలో దూసుకెళ్తన్న తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లేలా మెనిఫోస్టో ఉందని అన్నారు.

అధికారంలో ఉన్న పార్టీ అన్ని లెక్కలు తీసుకొని సహేతుకంగా ప్రకటించిన మెనిఫెస్టోను చిత్తుకాగితమంటే.. ఎటువంటి బాధ్యత, తాడూ బొంగరం లేని కాంగ్రెస్ చెప్పే మాటలు ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కర్ణాటకలో హామీలు అమలు చేయలేమని అక్కడి మంత్రలే ప్రకటిస్తున్న ఉదంతాలను చూస్తున్నామని, కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లని మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు ఏమయ్యాయో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read:ఇటు బాలయ్య అటు శ్రీలీల!

- Advertisement -