రూ.2 వేల నోటుపై కేంద్రం క్లారిటీ

326
rs 2000
- Advertisement -

రూ. 2 వేల నోటు ముద్రణపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం. రూ. 2 వేల నోటు ముద్రణను నిలిపివేసే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటించింది. ఆర్థిక శాఖసహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

లావాదేవీలను సులభంగా నిర్వహించేందుకు వీలుగా బ్యాంకు నోట్ల ముద్రణపై ఆర్బీఐని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే నోట్ల ముద్రణకు సంబంధించి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయినట్లు ఆర్‌బీఐ తెలిపిందని ఠాకూర్‌ వెల్లడించారు. లాక్ డౌన్ అనంతరం ముద్రణ ప్రక్రియ దశలవారీగా ప్రారంభమైందని తెలిపారు.

- Advertisement -