ఈ ఏడాది చేపమందు పంపిణీలేదు..!

277
chepa prasadam
- Advertisement -

కరోనా కారణంగా ఈ ఏడాది చేప మందు పంపిణీ నిర్వహించడం లేదన్నారు నిర్వాహకుడు బత్తిని హరినాథ్ గౌడ్. ప్రతీ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు చేపప్రసాదాన్ని పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా ప్రభుత్వం చేపప్రసాదం పంపిణీకి అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసిందని ….ఆస్తమా రోగులు చేపప్రసాదం కోసం హైదరాబాద్‌కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటివరకు ప్రభుత్వ సహాయంతో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో వివిధ ప్రాంతాల ఆస్తమా రోగులకు ఉచితంగా చేపప్రసాదాన్ని అందించామని తెలిపారు.

కరోనా కారణంగా గత మూడేండ్లుగా చేప మందును పంపిణీ చేయడంలేదు.

- Advertisement -