ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ లేదు: హరినాథ్ గౌడ్

34
bathini

కరోనా సెకండ్ వేవ్ కారణంగా చేప ప్రసాదం పంపిణీ లేదన్నారు బత్తిని హరినాథ్ గౌడ్. మీడియాతో మాట్లాడిన ఆయన…మృగశిరకార్తె ప్రవేశం రోజున ప్రతి ఏటా మాదిరిగానే జూన్‌ 7వ తేదీన దూద్‌బౌలిలోని తమ నివాసంలో సత్యనారాయణ వ్రతంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి 8వ తేదీన చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉదయం 10 గంటలకు తమ కుటుంబ సభ్యులందరం తీసుకుంటామని.. అలాగే తమ దగ్గరి బంధువులకు పంపిణీ చేస్తామని తెలిపారు.

175 ఏళ్లుగా వంశపారపర్యంగా తమ కుటుంబం అందిస్తున్న చేప ప్రసాదాన్ని గతేడాది కూడా కరోనా కారణంగా పంపిణీ చేయలేదన్నారు. చేప ప్రసాదం పంపిణీని విరమించుకోవాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారని ఆయన సూచన మేరకు విరమించుకున్నారు.