టీఆర్ఎస్‌దే అధికారం…కేసీఆర్‌ పాలనకే మొగ్గు

213
KCR
- Advertisement -

తెలంగాణలో టీఆర్ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇండియాటుడే సర్వే (పొలిటికల్ స్టాక్ ఎక్సెంజీ(పీఎస్‌ఈ)) స్పష్టం చేసింది. జనాదరణలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదని ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ సీఎం కేసీఆర్‌కు ఆదరణ పెరుగుతుందని వెల్లడించింది. 46శాతం మంది ఓటర్లు కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని వెల్లడించింది. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన శాంపిల్ సర్వేలో 43శాతం మంది ఓటర్లు తదుపరి సీఎంగా కేసీఆర్‌ను కోరుకోగా, తాజా సర్వేలో వారి సంఖ్య 46శాతానికి పెరిగిందని తెలిపింది. కే

4 రాష్ట్రాల్లో ఫోన్‌ద్వారా ఓటర్లను సర్వే చేసిన పీఎస్‌ఈ.. వెల్లడైన అంశాలను రాష్ట్రాల వారీగా వివరించింది. 17 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని 6,877 మంది అభిప్రాయాలను సేకరించగా మెజార్టీ ప్రజలు టీఆర్ఎస్ పాలన వైపే మొగ్గుచూపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సాంఘిక సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ గెలుపుకు దోహదం చేస్తాయని తెలిపింది. హైదరాబాద్‌ ప్రాంతంలో అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం కాంగ్రెస్‌ పార్టీ ఓట్లకు గండికొట్టే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి 52 శాతం మాత్రమే అవకాశాలున్నాయని తెలిపింది.బీజేపీకి- కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా 1 నుంచి 3 శాతం మాత్రమే ఉంటుందని అంచనా వేసింది. రాజస్థాన్‌లో సీఎం వసుంధర రాజేపై వ్యతిరేకత ఉందని ఇండియాటుడే వెల్లడించింది. బీజేపీ కంటే కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందని అయితే బీజేపీ సీఎం అభ్యర్థిని మార్చితే ఆ పార్టీకి సానుకూలంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్‌ మరోసారి అధికారంలోకి వస్తారని వెల్లడించింది. అజిత్‌ జోగికి చెందిన జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌, బీఎస్పీల పొత్తు అధికార బీజేపీకే లాభిస్తుందని తెలిపింది.

- Advertisement -