టీఆర్స్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన హరిత కార్యక్రమం IGNITING MINDS #HaraHaiTohBharaHai #GreenIndiaChallenge కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ విఠల్ రావు తెలిపారు.
ఈ చాలెంజ్ నేను స్వీకరించి ఈ రోజు మా జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో మూడు మొక్కలు నాటి మూడు సంవత్సరాలు వాటిని రక్షించే బాధ్యతను తీసుకుంటానని ఆయన అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావుకి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయకి వారు కూడా మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటే విధంగా నాటిన మొక్కల సెల్ఫీలతో hashtags #HaraHaiTohBharaHai #Green India చాలెంజ్ పంపగలరని కోరుచున్నాను. నాటిన మొక్కలను మూడు సంవత్సరాలు రక్షించాల్సిన బాధ్యత లు కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.