తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మోదీ తెలంగాణకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని రాయికల్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు.
తెలంగాణకు ఏం చేశారని పలుసార్లు ప్రధానిని ముఖ్యమంత్రి ప్రశ్నించారని ఈ సందర్బంగా కవిత గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ రెండు, మూడుసార్లు ప్రెస్‌మీట్లు పెట్టి మా రాష్ట్రానికి ఏం చేశారని మోదీని ప్రశ్నించారు. దానికి మోదీ నుంచి సమాధానం రాలేదు. తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ విషయాన్ని జగిత్యాల ప్రజలంతా గమనించాలి.
ఉత్తి మాటలుచెప్పేవాళ్లేవరూ… అభివృద్ధి చేసే నాయకులేవరు .. ఉట్టి మాటలు చెప్పే పార్టీ ఏది… ముఖంచాటేసే పార్టి ఏది… అన్నది ప్రజలు గుర్తించేలా కార్యకర్తలు పనిచేయాలని కవిత సూచించారు. పట్టుదలతో పనిచేస్తున్న సంజయ్‌కి తాము అంతా అండగా ఉండి సహాయసహకారాలు అందిస్తామని కవిత స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
దేశమంతటా గులాబీమయం:కవిత
తెలంగాణాంతటా మోదీపై నిరసన సెగ..
ఫార్ములా ఈ రేస్..ట్రయల్ రన్‌కు సిద్ధం