ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ పార్లమెంటేరియన్’ అవార్డు అందుకున్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రేష్ఠ్ సంసద్ అవార్డుల బహూకరణ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.శ్రేష్ఠ్ సంసద్ పేరుతో సర్వే నిర్వహించి ఎంపి కవితను ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
మొత్తం 545మంది ఎంపీలలో 25మంది ఎంపిక చేశారు. ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవాదృక్పథం, లోక్‌సభకు హాజరు, లోక్‌సభ నిర్వహణలో పాత్ర, నియమనిబంధనలు పాటించడం, ప్రశ్నలగడం తదితర అంశాల ఆధారంగా ఎంపీలను ఈ అవార్డుకు ఎంపికచేశారు.ఉద్యమ సమయంలో అమెరికానుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాంస్కృతిక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజలను చైతన్యపర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని సంస్థ పేర్కొంది. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఎంపీ కవిత చురుగ్గా వ్యవహరించారని తెలిపింది.