ఎంపీ కవిత చొరవతో క్షేమంగా ఇంటికి వచ్చిన ఇరాక్ బాధితులు

259
mp kavitha 12 iraq victims
- Advertisement -

బతుకు దెరువు కోసం ఇరాక్ దేశం వెళ్లి ఆ దేశంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొని చివరకు ఇరాక్ జైళ్లలో బందీలుగా ఉన్న 12 మంది తెలంగాణ బిడ్డలకు విముక్తి లభించింది. ఇరాక్ జైళ్లలో బంధీలుగా ఉన్న కరీంనగర్ జిల్లాకు చెందిన నలుగురు, కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు, నిజామాబాద్ జిల్లాకు చెందిన 5గురు ఉత్తర ప్రదేశ్కు చెందిన ఒకరు ఎంపీ కవిత చొరవతో స్వదేశానికి చేరుకున్నారు. ఇరాక్ జైళ్లలో ఉన్న వీరిని విడిపించేందుకు తెలంగాణ జాగృతి తరుపున ఎంపీ కవిత విశ్వప్రయత్నాలు చేశారు.

ఎట్టకేలకు ఎంపీ కవిత ప్రయత్నాలు ఫలించాయి. ఎంపీ కవిత చొరవతో ఇరాక్ జైళ్లలో నాలుగు నెలలుగా బందీలుగా ఉన్న 12 మంది తెలంగాణ బాధితుల ఇరాక్ ప్రభుత్వం విడుదల చేసింది. బాధితులు ఇరాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వీరిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో తెలంగాణ జాగృతి ప్రాధాన కార్యదర్శి నవీన్ ఆచారి రిసీవ్ చేసుకుని వారి వారి ఇండ్లకు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

- Advertisement -