మోదీకి పోటీగా ప్రియాంక గాంధీ..గెలుపెవరిదో

237
modi priyanka Gandhi
- Advertisement -

సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. అయితే ప్రియాంక రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో కాంగ్రెస్ కు కొంచెం బలం చేకూరినట్టయింది. ఆమె ప్రచారంతో కాంగ్రెస్ క్యాడర్ లో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రియాంక ఉత్తర ప్రదేశ్ కు ఇంఛార్జ్ గా ఉన్న విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ తో పాటు ఆమె దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక ఎక్కడి నుంచి పోటీ చేస్తుందని అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ప్రియాంక. ఇటివలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఎక్కడికి పోటీ చేయాలనుకుందొ చెప్పేసింది. వారణాసి నుంచి తాను ఎందుకు పోటీ చేయకూడదని కార్యకర్తలను ప్రశ్నించింది. ఈసందర్భంగా కార్యకర్తలు ఆమెను రాయ్ బరేలి నుంచి పోటీ చేయమని అడగ్గా..ఆమె వారణాసి నుంచి ఎందుకు పోటీ చయకూడదని ప్రశ్నించారు.

అంతేకాకుండా రాయ్‌బరేలీలో పనులకు ఆటంకం కలగకుండా చూసుకుంటానని తన తల్లి సోనియాకు మాట ఇచ్చాననీ తెలిపారు. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పోటీచేయనున్న నేపథ్యంలో అదే స్థానం నుంచి తాను ఎందుకు బరిలోకి దిగకూడదని ప్రియాంక ప్రశ్నించటం గమనార్హం. నిజంగానే ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేస్తే దేశ ప్రజలందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంటుందని చెప్పుకోవచ్చు.

- Advertisement -