నిజామాబాద్‌లో కారు నడిపిన ఎంపీ కవిత..

221
mp kavithacar
- Advertisement -

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది టీఆర్ఎస్. ఇప్పటికే 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్‌ క్షేత్రస్ధాయిలో ప్రజలతో మమేకమవుతూ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తోంది. ఇక ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన వాహనాలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు చేరుకోగా నిజామాబాద్ ఎంపీ కవిత కారును నడిపి కార్యకర్తల్లో జోష్‌ని నింపింది

నిజామాబాద్ అర్బన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా నామినేషన్ వేసే కార్యక్రమంలో భాగంగా ఆమె కారును నడిపారు. గులాబీ రంగు అంబాసిడర్ కారును నడిపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎంపీ కవిత డ్రైవ్ చేస్తుండగా గణేశ్ గుప్తా ముందు సీట్లో కూర్చున్నారు. ఎంపీ కవిత డ్రైవింగ్ చేస్తున్న దృశ్యాలను ఫోటో తీసేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు. మొత్తంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కవితక్క కారు నడపడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -