యుకేలో టీఆర్ఎస్‌ ఎన్నికల కార్యాలయం..

297
TRS Office at UK fot Telangana Assembly Elections
- Advertisement -

తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నారై టీ. ఆర్. యస్ ఆధ్వర్యం లో వినూత్న ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ” టీ.ఆర్.యస్ మిషన్” ఇటీవల ఎంపీ కవిత మరియు ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబందించి లండన్ లో ఎన్నారై టీ. ఆర్. యస్ యూకే ఆధ్వర్యం లో ప్రత్యేక ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఎన్నారై టీఆర్‌ఎస్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మరియు ఎన్నారై టీఆర్‌ఎస్ -యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి నాయకత్వంలో టీఆర్‌ఎస్-యూకే టీమ్ ఈ వార్ రూమ్ కార్యాలయాన్ని ప్రారంభించింది. టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సమన్వయకర్త మహేశ్ బిగాల స్కైప్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యాలయం ద్వారా ఆసరా పించన్లు, నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సహా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాల్ క్యాంపేయిన్ వాలంటీర్లు తెలంగాణలోని ఓటర్లకు ఫోన్ కాల్ ద్వారా వివరించనున్నారు.

ఈ సంధర్భంగా అనీల్ కూర్మాచలం మాట్లాడుతూ ఏ విధంగా నైతే ఉద్యమ సమయంలోఎన్నారై టీఆర్‌ఎస్-యూకే తన వంతు పాత్ర పోషించిందో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా క్రియాశీలకంగా ప్రచారం చేయబోతోందని అన్నారు.రాబోయే రోజుల్లో ప్రతీ కార్యకర్త తమ తమ శక్తి మేరకు ప్రచారం చేసి గత నాలుగు సంవత్సరాల మూడు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టీ.ఆర్.యస్ పార్టీ ని అధికారంలో తీసుకొచ్చే విధంగా పని చెయ్యాలని పిలుపునిచ్చారు.

TRS Office at UK fot Telangana Assembly Elections

కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్‌ఎస్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం,యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ సీకా చంద్రశేఖర్ గౌడ్, అడ్వైసరీ బోర్డు సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర, వైస్ చైర్మన్ మధుసూధన్ రెడ్డి, సెక్రటరీలు సృజన్ రెడ్డి చాడ, హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల, సంయుక్త కార్యదర్శులు సేరు సంజయ్,మల్లా రెడ్డి బీరం, సతీష్ రెడ్డి బండ,రమేష్ యేసంపల్లి,సురేష్ గోపతి,అధికార ప్రతినిధులు రవి కుమార్ రేటినేని,రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జ్ నవీన్ భువనగిరి, భాస్కర్ మొట్ట, మీడియా ఇంచార్జ్ సత్యపాల్ పింగిళి, ఐటీ సెక్రటరీ వినయ్ ఆకుల, మెంబెర్ షిప్ ఇంచార్జ్ అశోక్ కుమార్ అంతగిరి,ఈస్ట్ లండన్ ఇంఛార్జ్ ప్రశాంత్ కటికనేని.రీజినల్ కోఆర్డినేటర్ శివ కుమార్ (లీడ్స్),ఎగ్జిక్యూటివ్ సభ్యులు రామ్ కలకుంట్ల పాల్గొన్నారు. జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా వీరంతా పనిచేయనున్నారు.

- Advertisement -