నిజామాబాద్ ఉప ఎన్నికల పోలింగ్..అప్‌డేట్

177
nizamabad mlc polls
- Advertisement -

నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా మొత్తం 824 మంది స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 50 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లో 28 పోలింగ్ కేంద్రాలు, కామారెడ్డిలో 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పోలింగ్‌ విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 10 శాతం అదనపు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. ఈనెల 12న ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా రెండు రౌండ్లలో కౌటింగ్ పూర్తి కానుంది.

స్ధానిక ప్రజాప్రతినిధుల్లో 24 మందికి కరోనా రావడంతో వారికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పీపీఈ కిట్లతో అంబులెన్స్‌ల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. పర్యవేక్షణ కోసం ఆయా పోలింగ్‌ కేంద్రాల దగ్గర వైద్య ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు.

- Advertisement -