లాటరీలో రూ.28కోట్లు గెలుచుకున్న నిజామాబాద్ వాసి

432
Vilas-Rikkala
- Advertisement -

బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి లాటరీతో కోటిశ్వరుడయ్యాడు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి నివాసి విలాస్ రిక్కల పనినిమిత్తం భార్యతో కలిసి దుబాయ్ వెళ్లాడు. వీరు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే విలాస్‌ 45 రోజుల క్రితం ఉద్యోగం కోసం దుబాయ్‌కు వెళ్లాడు. కానీ ఉద్యోగం రాకపోవడంతో స్వదేశానికి తిరిగివచ్చేశాడు. గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన విలాస్‌.. రెండేళ్లుగా అక్కడి ప్రముఖ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న అతను లాటరీ టికెటు కొనుగోలు చేసే అలవాటును మాత్రం మానుకోలేదు. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తన భార్య వద్ద రూ. 20వేలు తీసుకుని దుబాయ్ లో ఉన్న తన స్నేహితుడు రవి సహాయంతో లాటరీ టికెట్లు కొనుగోలు చేశారు.

దీంతో విలాస్‌ పేరు మీద రవి మూడు టికెట్లు కొనుగోలు చేశాడు. ఇక్కడే కీలక పరిణామం చోటుచేసుకుంది. అందులోని ఓ టికెటు.. విలాస్‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. యూఏఈలో అతను భారీ లాటరీ గెలుపొందినట్టు విలాస్‌కు ఫోన్‌ వచ్చింది. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన భర్య పద్మనే ఈ సంతోషానికి, వేడుకకు కారణమని విలాస్ తెలిపాడు.

- Advertisement -