HARISHRAO:నిజామాబాద్‌ ఘటనపై విచారణకు ఆదేశం

36
- Advertisement -

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని సహాయకులు రెండు కాళ్లు పట్టుకుని లాక్కెళ్తున్నట్టు ఉన్న దృశ్యాలపై వివరణ ఇవ్వాలని మంత్రి ఆసుపత్రి సూపరిటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని పేర్కొన్నారు.

సోషల్‌మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వీడియోపై నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సెక్యూరిటీ సిబ్బందిని విచారించినట్టు తెలిపారు. వీల్‌ఛైర్‌ తీసుకొచ్చేలోపు లిఫ్ట్‌ రావడంతో రోగి తల్లిదండ్రులు అతని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లారని చెప్పారు. ఇది చూసి సిబ్బంది వారించి.. వీల్‌ఛైర్‌లో తీసుకెళ్లారని స్పష్టం చేశారు. ఇదంతా తెలియక ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి…

CMKCR:విగ్రహాం కాదు…నిలువెత్తు నిదర్శనం:కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ను కలిసిన ప్రకాశ్‌అంబేద్కర్‌..

కులాంతర వివాహం చేసుకునే వారికి.. అద్భుత పథకం!

- Advertisement -