ప్రారంభ‌మైన నీతి ఆయోగ్ స‌మావేశం..

271
niti ayog
- Advertisement -

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో నీతి ఆయోగ్ స‌మావేశం ప్రారంభమైంది. ఈకార్య‌క్ర‌మంలో కేంద్ర‌మంత్రులు, ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, అధికారులు  పాల్గోన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్, చంద్ర‌బాబులు కూడా ఈ స‌మావేశంలో పాల్గోన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ప‌ట్టిన ప‌లు అభివృద్ది ప‌థ‌కాల గురించి సీఎం కేసీఆర్ స‌మావేశంలో వివ‌రించనున్న‌ట్లు తెలుస్తోంది. రైతుల‌కు పంట‌పెట్టుబ‌డి సాయం, రైతు సంక్షేమానికి ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల గురించి సీఎం కేసీఆర్ స‌మావేశంలో మాట్లాడ‌నున్నారు.

kcr in niti ayog meeting

ఇక ఈ స‌మావేశానికి ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌రుకాగా..ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ హాజ‌రుకాలేదు. ఈ భేటీలో రైతుల ఆదాయంతో పాటు 7 అంశాల‌పై చ‌ర్చ జ‌రుగ‌నుంది. వ్యవసాయంరంగ అభివృద్ధి, రైతుల ఆదాయం రెట్టింపునకు దోహదంపై , ఈ-నామ్, వ్యవసాయ, మార్కెటింగ్ సంస్కరణలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈసంద‌ర్భంగా ప‌లువురు రైతు వ్య‌వ‌స్ధ‌పై ప‌లు సూచ‌న‌లు కూడా ఇవ్వ‌నున్నారు. గాంధీ జయంతి వేడుక‌ల‌కు సంబంధించిన అంశాల‌ను కూడా ప్ర‌స్తావించ‌నున్నారు. ప‌లు స‌ల‌హాలు, సూచ‌ల‌నలు అధికారుల‌కు ఇవ్వ‌నున్నారు. సాయంత్రం 4గంట‌ల‌కు నీతి ఆయోగ్ పాల‌క‌మండ‌లి స‌మావేశం ముగియ‌నుంది. స‌మావేశం ముగిసిన అనంతరం ముఖ్య‌మంత్రి కేసీఆర్ తిరిగి హైద‌రాబాద్ కు చేరుకొనున్నారు.

- Advertisement -