ఇక అలాంటి పాత్రలు చేయను-ప్రగతి

476
Actor Pragathi
- Advertisement -

విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ .. సహజమైన నటనతో నటి ప్రగతి ప్రేక్షకులను మెప్పించారు. కోలీవుడ్‌లో “భాగ్యరాజా సినిమా ద్వారా ఆమె తమిళ చిత్రపరిశ్రమకి కథానాయికగా పరిచయమయ్యారు .. అప్పుడు ప్రగతి వయసు 17 యేళ్లే. అలా అమె వరుసగా రెండేళ్లలోపే హీరోయిన్ గా ఏడు సినిమాలు చేసింది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టీస్ట్‌గా కొనసాగుతోంది. మంచి ఆప్యాయత గల అమ్మగా నటించడంలో ప్రగతి ముందుంటారనే చెప్పాలి. నటనలో కూడా ఆమె ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తున్నారు. టాలీవుడ్ మదర్ క్యారెక్టర్స్ తో కనిపించే నటీమణులకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. సినీ ప్రేక్షకులు కూడా వారిని ఎక్కడ చూసినా ఈజీగా గుర్తు పట్టేస్తారు. అలాంటి వారిలో ప్రగతి ఒకరు.

Actor Pragathi

అయితే గతంలో ఎక్కువగా కనిపించిన ప్రగతి ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. ఎదో చిన్న చిన్న రోల్స్ కనిపించినప్పటికీ సినిమాలో ఆమె ఉన్నట్లు ఎవరు మాట్లాడుకోవడం లేదు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి ఒక విషయాన్ని చెప్పారు. ఒక ఏడాదిలో నేను 23 సినిమాలకు పైగా చేశాను. కానీ ఆ పాత్రలు ఎక్కువగా గుర్తింపు తేలేదు.

ఎదో సన్నివేశంలో ఎదో ఇంటికి వచ్చిన అతిధులకు కాపీ ఇచ్చే పాత్రలే చేశాను. అవి నాకు చాలా విసుగు తెప్పించాయి అని ప్రగతి వివరించారు. ప్రస్తుతం తన పాత్రకు ఇంపార్టెంట్ ఉంటే తప్ప ఈ సీనియర్ నటి నటించను అని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రగతి భర్త నుంచి విడిపోయి తన కుమారుడితో హైదరాబాద్ లోనే ఉంటున్నారు.

- Advertisement -