బిగ్‌బాస్‌ 5: ఈ వారం లహరి ఎలిమినేట్‌..!

31
Bigg Boss Lahari

బిగ్ బాస్ సీజన్ 5 నాలుగోవారానికి చేరువకాబోతోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌లో ప్రారంభమైన ఈ సీజన్‌లో తొలివారం సరయు.. రెండో వారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడోవారంలో ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. వారిలో శ్రీరామచంద్ర, మానస్‌, ప్రియ, ప్రియాంక, లహరి నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో శ్రీరామ్‌, మానస్‌ భారీ ఓట్లతో ఓటింగ్‌లో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. వీరి తర్వాత ప్రియాంక కూడా మంచి ఓట్లే సంపాదించుకుని సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి కావాల్సినంత స్క్రీన్‌ స్పేస్‌ దొరకడంతో పాటు ఎలాంటి నెగెటివిటీ కూడా లేకపోవడంతో ఈ ముగ్గురూ ఈవారం సేఫ్‌ అయినట్లే! మిగిలిందల్లా లహరి, ప్రియ.

నిజానికి ప్రియ నామినేషన్స్‌లోకి వచ్చిన రోజే ఆమె ఎలిమినేట్‌ అవడం ఖాయం అనుకున్నారంతా! ఒక అమ్మాయి గురించి అందరి ముందు బ్యాడ్‌గా మాట్లాడటంతో ప్రియపై నెగెటివిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఆమె కూడా ఒక మహిళే కదా, అలాంటిది ఇంకో అమ్మాయిని పట్టుకుని మగాళ్లతో బిజీ అని ఎలా మాట్లాడగలిగింది? రాత్రిపూట హగ్గులంటూ బూతుగా ఎలా చిత్రీకరించగలిగింది? అని ఆక్రోశించారు నెటిజన్లు.

కానీ ఎప్పుడైతే రవి.. ఇంట్లో సింగిల్‌మెన్‌ (పెళ్లికానివాళ్లు) ఉన్నప్పటికీ ఆమె నా వెంట పడుతుంది అంటూ ప్రియతో లహరి గురించి బ్యాడ్‌గా మాట్లాడిన వీడియో బయటకు వచ్చిందో ఆ నెగెటివిటీ మొత్తం రవి మీదకు మళ్లింది. రవి వల్లే ప్రియ అలా మాట్లాడాల్సి వచ్చిందని పలువురూ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈ ఇద్దరు చేసిన తప్పులకు లహరి బలి కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ వారం లహరి ఎలిమినేట్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే లహరికి నేడు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆఖరి రోజు కానుంది.