నితీశ్ కుమార్ రూటే సపరేటు!

55
- Advertisement -

బిహారీ సీఎం నితీశ్ కుమార్ రూటే సపరేటు. ఆయన ఏం చేసిన సంచలనమే. మద్యపాన నిషేదాన్ని అమలు చేసిన, ఆర్జేడీ- కాంగ్రెస్ పొత్తుతో గెలిచి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, తిరిగి అదే కూటమితో జట్టుకట్టినా నితిశ్‌ రూటే సపరేటు.

బీజేపీతో పొత్తుకు వీడ్కోలు చెప్పిన నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా ప్రకటించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ ల సపోర్ట్ తో బీహార్ సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయేతో తెగతెంపులు చేసుకోవాలని తమ పార్టీ జేడీ(యూ) నిర్ణయం తీసుకుందని, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

సాయంత్రం 4 గంటలకు బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్‌కు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఎనిమిదోసారి కావడం విశేషం. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఆర్జేడీ సారథ్యంలోని 7 పార్టీలతో కూడిన మహాఘట్‌బంధన్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నితీశ్ కుమార్ ప్రకటించారు.

- Advertisement -