ఫిబ్రవరిలో నితిన్ ‘చెక్’..

50
Check

హీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ యంగ్‌ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘చెక్’. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కి చక్కటి స్పందన లభించింది. ఇందులో కథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ పాత్రలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఫిబ్రవరి 19న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. జైలు నేపథ్యంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కాన్సెప్ట్ ఇది. ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందన్నారు. నితిన్- చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయని ఆయన తెలిపారు.ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.