సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం..

62
cm kcr

నిర్మల్ జిల్లా సొన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా లారీ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమనికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.డ్రైవర్ లకు,వాహన దారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెంది రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినప్పటికీ అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్లడం అభినందనీయమని అన్నారు.

కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన వాహనదారులకు ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఆరు నెలల వాహన పన్ను మాఫీ చేయడం జరిగిందని తెలిపారు. దీనివల్ల వాహన దారులకు ఆర్థిక భారం పడకుండా జరిగిందని అన్నారు. అంతకు ముందు టోల్ ప్లాజా వద్ద ప్రజల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.