ఏపీలో కొత్తగా 137 కరోనా కేసులు..

44
corona

ఆంధ్రపదేశ్‌లో గడచిన 24 గంటల్లో 48,313 కరోనా పరీక్షలు నిర్వహించగా 137 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అదే సమయంలో 167 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8,86,694 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,78,060 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 1,488 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,146కి చేరింది.

ఇక కొత్తగా నమోదైన పాజిటీవ్ కేసులలో అత్యధికంగా విశాఖ జిల్లాలో 17, కృష్ణా జిల్లాలో 17, తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు గుర్తించారు. గుంటూరు జిల్లాలో 16, అనంతపురం జిల్లాలో 15, చిత్తూరు జిల్లాలో 12 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యల్పంగా కడప జిల్లాలో 4 కొత్త కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో 5, శ్రీకాకుళం జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో 6 కేసులు గుర్తించారు.