జంధ్యాల ట్రెండ్ సెట్టర్‌..’ముద్దమందారం’కు 40 ఏళ్లు

96
mudda mandaram

వెండితెరపై ట్రెండ్ సెట్టర్ మూవీ ముద్దమందారం. ప్రేమకోసం జీవితం అనే నినాదంతో జంధ్యాల తెరకెక్కించిన అద్భుత ప్రేమకావ్యం ఈ మూవీ. అప్పటివరకు ఉన్న సినిమాలకు డిఫరెంట్‌గా సరికొత్త కథ, కథనం, నూతన నటీనటులతో జంధ్యాల చేసిన అద్భుత ప్రయోగం ముద్దమందారం. సరిగ్గా 40 ఏళ్లకు క్రితం సెప్టెంబర్ 11న అంటే 1981లో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం అప్పటికీ,ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ మూవీనే.

రమేశ్‌ నాయుడు సంగీతం, వేటూరి సాహిత్యం, ఎస్‌. గోపాల్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ అలివేణి ఆణిముత్యమా , నీలాలు కారేనా కాలాలు మారేనా పాటలు ఇప్పటి ప్రేక్షకులనూ అలరిస్తూనే ఉంటాయి. ఈ సినిమాతో జంధ్యాల దర్శకుడిగా మారగా ప్రదీప్, పూర్ణిమలు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.

సంపన్న కుటుంబంలో జన్మించి, విదేశాల్లో చదువుకుని భారతదేశం తిరగివచ్చిన కుర్రాడు… దేవాలయం వద్ద పూలమ్ముకునే పేద పిల్ల ప్రేమలో పడటం,వీరి ప్రేమను అంగీకరించని హీరో తండ్రి ఆ ప్రేమకు వెల కట్టడం,హీరో,హీరోయిన్ పారిపోయి పెళ్లిచేసుకోవడం తర్వాత వారికి పిల్లాడు పుట్టడం,అయిన హీరో తండ్రి వీరిద్దరిని విడదీసేందుకు ప్రయత్నించడం, వారిద్దరూ ఆత్మహత్యకు ప్రయత్నించడం,చివరకు పెద్దలు ఒప్పుకుని మళ్లీ పెళ్లి చేయడంతో కథ సుఖాంతం అవుతుంది.
కథకు తోడు సినిమాలోని పాటలు హైలైట్. ఎస్.గోపాల్ రెడ్డి కెమెరా పనితనం ప్రాణం పోసింది. జి.జి.కృష్ణారావు ఎడిటింగ్ అందం తెచ్చింది. తొలి చిత్రమే అయినా జంధ్యాల చేసిన మ్యాజిక్ సూపర్బ్. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం అప్పటికి, ఇప్పటికి ఎవర్ గ్రీన్ మూవీనే.