నితిన్ చాలా లవ్ స్టోరీస్ చేశాడు కానీ అందులో ఇష్క్ అనేది ఓ క్లాసిక్ అని చెప్పవచ్చు. సినిమా నడిచే తీరు , లవ్ స్టోరీ , నితిన్ – నిత్య మీనన్ కెమిస్ట్రీ , సాంగ్స్ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ముఖ్యంగా పీసీ శ్రీరామ్ విజువల్స్ స్క్రీన్ పై మంచి ఫీల్ తీసుకొచ్చాయి. అందుకే ఇప్పుడు నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. హీరోల పుట్టిన రోజుకి బెస్ట్ మూవీస్ ను ఫ్యాన్స్ మేకర్స్ రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆరేంజ్ సినిమాను రీ రిలీజ్ చేశారు. మెగా ఫ్యాన్స్ నుండి ఈ సినిమాకి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు నితిన్ కూడా తన కెరీర్ బెస్ట్ లవ్ స్టోరీ ఇష్క్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మార్చ్ 29 న ఇష్క్ థియేటర్స్ లోకి వస్తుంది. మరి నితిన్ ఇష్క్ సినిమాకి రీ రిలీజ్ కి ఆశించిన రెస్పాన్స్ దక్కుతుందా ? లేదా చూడాలి.
ఇవి కూడా చదవండి..