ఆకట్టుకుంటున్న భీష్మ ‘వాట్టే బ్యూటీ’ సాంగ్

621
Bheeshma
- Advertisement -

యంగ్ హీరో నితిన్, రష్మీక మందనలు జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. ఛలో మూవీ దర్శకుడు వెంకీ కుడుముల ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ నుంచి టీజర్, ఒక సాంగ్ ను విడుదల చేశారు. ఈ టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.

తాజాగా ఈమూవీ నుంచి సెకండ్ సాంగ్ ను విడుదల చేశారు. వాట్టే బ్యూటీ..నువ్వు యాడా ఉంటే ఆడ్నే రోటి..తిప్పుతుంటే నడుమే నాటి అంటూ సాగిన ఈ సాంగ్ లో నితిన్, రష్మిక అదరగొట్టారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు జానీ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆ సాంగ్ ను రాశారు. ఫిబ్రవరి రెండో తేదీన సాయంత్రం 4.05 గంటలకు లిరికల్ వీడియోను విడుదల చేస్తామని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 21న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈమూవీపై నితిన్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.

- Advertisement -