భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘భీష్మ’..

538
Bheeshma
- Advertisement -

నితిన్ కథానాయకుడిగా రూపొందిన ‘భీష్మ’ .. గత నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, ఆ తరువాత కూడా అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. ఈ సీజన్ క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని ట్రేడ్ డిక్లేర్ చేసింది. సంక్రాంతి బరిలో అల వైకుంఠపురములో .. ఆ తర్వాత భీష్మకు మాత్రమే ఆ ఛాన్స్ దక్కిందన్నది ఓ విశ్లేషణ.

Bheeshma Movie

ఇక భీష్మ చిత్రం 10 డేస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాం 8.57కోట్లు – సీడెడ్ 3.13కోట్లు- ఉత్తరాంధ్ర 2.86 కోట్లు- ఈస్ట్ 1.64 కోట్లు-వెస్ట్ 1.21 కోట్లు-కృష్ణా 1.44 కోట్లు- గుంటూరు 1.73 కోట్లు- నెల్లూరు 0.72 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా 1.88 కోట్లు.. ఓవర్సీస్ 3.10 కోట్లు వసూలైంది. వరల్డ్ వైడ్ టోటల్ 26.28 కోట్లు కలెక్టయ్యింది. `భీష్మ` చిత్రానికి 22.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 26.28 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇప్పటికే ఈ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారని తెలుస్తోంది.

- Advertisement -