మొక్కలు నాటిన నిర్మాత నల్లమలపు బుజ్జీ..

191
Nallamalupu Bujji

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు శామీర్ పేట దగ్గరలోని తూముకుంటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ నివాస సముదాయంలో మొక్కలు ప్రముఖ నిర్మాత (రేసుగుర్రం) నల్లమలపు బుజ్జి నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ నివాస సముదాయాలను పరిశీలించడం కోసం ఇక్కడికి రావడం జరిగిందని ఇవి ఎంతో బాగా ఉన్నాయని పేద ప్రజలకు ప్రభుత్వం ఇంత అందంగా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టీ నిర్మించాడం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కి పేద ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

అదేవిధంగా పచ్చదనం పెంచడం కోసం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి ఈ రోజు ఈ నివాస సముదాయంలో మొక్కలు నాటడం జరిగింది అని ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందు తీసుకోబోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కి అభినందనలు తెలియజేస్తూను అని అన్నారు. ఈ చాలెంజ్ ఇదేవిధంగా ముందుకు కొనసాగాలని అందులో భాగంగా హీరో వెంకటేష్, హీరోయిన్ అనుష్క, దర్శకులు వివి వినాయక్, పూరి జగన్నాథ్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.