విమానయాన రంగంలో కేంద్రం భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. భారతీయ ఏరోస్పేస్ రూట్ల హేతుబద్దీకరణ చేస్తామని… పీపీపీ భాగస్వామ్యంతో మరో 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధి చేస్తామన్నారు. రూ. 13 వేల కోట్లతో 12 నూతన ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఏఏఐకు రూ. 2,300 కోట్ల నిధులు కేటాయిస్తామని తెలిపారు.
విమాన మరమ్మతుల హబ్‌గా భారత్‌ను తీర్చేదిద్దే ప్రయత్నం చేస్తామన్నారు. పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే ప్రక్రియ నిరంతరం జరుగుతోందని నిర్మల సీతారామన్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, బీఏఎఫ్‌ఆర్ అమలులో కేంద్ర ప్రభుత్వం చాలా ముందుందని చెప్పారు.
()ఎంఆర్‌వో హబ్‌ల్లో దేశీయ, విదేశీ విమానాలకు, యుద్ధ విమానాలకు మరమ్మతులు
()లెవల్ ఫ్లేయింగ్ ఫీల్డ్ కల్పించే విధంగా సంస్కరణలు
() భారతీయ స్టార్టప్‌లకు ప్రోత్సాహం
() జియో స్పేషియల్ రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు.
()దేశీయ రక్షణ ఉత్పత్తి సంస్థల బలోపేతం… ఇకపై నిర్దేశిత జాబితాలోని సామాగ్రి, విడిభాగాలు దేశంలోనే తయారీ
()విద్యుత్ పంపిణీ రంగంలో నూతన సంస్కరణలు…
()నీటిపారుదల, క్షామపీడిత ప్రాంతాల గుర్తింపులో స్టార్టప్‌లకు ప్రోత్సాహం